Posted [relativedate]
ఓ సినిమా రిలీజ్ కు ముందే లాభాల్లోకి రావాలంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. స్టార్ సినిమా రిలీజ్ ముందు లాభాల్లో రావడం కామనే కాని ఆ లాభాలను డిస్ట్రిబ్యూటర్లు కూడా పొందేలా చేయడమే అసలైన సక్సెస్. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల అంచలాలను బట్టి ఈ బిజినెస్ జరిగింది అంటే ఓకే కాని ఓ హిస్టారికల్ మూవీతో ఈ ఫీట్ సాధించడం గ్రేట్ అనేయొచ్చు. నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా రాబోతున్న గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ ప్రీ రిజీ బిజినెస్ లో అదరగొడుతుంది.
సినిమా పోస్టర్స్, టీజర్, ట్రీలర్ ఇలా ప్రతి ఒక్కటి సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. తెలుగు సినిమా పరిధి పెంచే సినిమాగా కనబడుతున్న శాతకర్ణి మూవీ రిలీజ్ కు ముందే లాభాల్లో రావడం మంచి తరుణమే. క్రిష్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతున్న శాతకర్ణి ట్రైలర్ విజువల్స్ విమర్శకులను సైతం ఔరా అనిపించేలా చేస్తున్నాయి. దాదాపు 55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ కు ముందే లాభాల్లో రచ్చ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.