శాతకర్ణిలో హైలెట్స్ ఇవే..!

Posted November 28, 2016, 5:56 pm

Image result for krish and balakrishna

నందమూరి బాలకృష్ణ వందవ సినిమాగా రాబోతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా క్రిష్ డైరక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపౌందుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రయూనిట్ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక సినిమాలో హైలెట్ గా నిలిచే అంశాల గురించి ఫిల్మ్ నగర్ లో చర్చ నడుస్తుంది. బాలయ్య ప్రతి సినిమాలో డైలాగ్స్ అదిరిపోతాయి. ఇక చారిత్రిక కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో చాలా స్పెషల్ డైలాగ్స్ ఉంటాయట. వాటిని బాలకృష్ణ పలికిన విధానం కూడా అదుర్స్ అంటున్నారు.

ఇక సినిమాలో నాలుగు వార్ సీన్స్ ఉంటాయట అవి కూడా వేటికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా సముద్రంలో వార్ సీన్ సినిమాకే హైలెట్ అని అంటున్నారు. అవే కాకుండా తెలుగు చక్రవర్తి కాబట్టి తెలుగు జాతి.. తెలుగు భాషా గొప్పతనం గురించి విషయాల పట్ల కూడా సినిమాలో మంచి సీన్స్ ఉంటాయని అవి ప్రేక్షకులకు తప్పక నచ్చుతాయని అంటున్నారు. మరి వస్తున్న ఫిల్లర్స్ అయితే సినిమా మీద అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

డిసెంబర్ 16న తిరుపతిలో ఆడియో వేడుక జరుపుకోబోతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా జనవరి 12న రిలీజ్ అని ముందే ఎనౌన్స్ చేశారు. ఇక సినిమా రిలీజ్ కు చాలా టైం ఉండటంతో సినిమా ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు.