Tuesday, January 25, 2022
HomeEntertainmentCinema Latestలైవ్‌లో రెచ్చి పోయిన బాలయ్య

లైవ్‌లో రెచ్చి పోయిన బాలయ్య

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రానికి ‘పైసావసూల్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం, ఫస్ట్‌లుక్‌లో బాలయ్య దుమ్ము దులిపేశాడు అంటూ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. నేడు బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ నిమిత్తం బాలయ్య పోర్చ్‌గల్‌లో ఉన్నాడు. ఆ కారణంగానే బాలయ్యను ఫ్యాన్స్‌కు దగ్గర చేసేందుకు పూరి లైవ్‌లోకి తీసుకు వచ్చాడు.

సహజంగా బాలయ్య ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. కాని పూరి ఒత్తిడి చేయడంతో గొంతు సరిగా లేకున్నా కూడా ఫ్యాన్స్‌ కోసం లైవ్‌లోకి వచ్చాడు. లైవ్‌లో ఫ్యాన్స్‌తో బాలయ్య బాగా ఇంట్రాక్ట్‌ అయ్యాడు. అభిమానుల కోరిక మేరకు డైలాగ్‌ను కూడా చెప్పాడు. షూటింగ్‌ నీళ్లలో చేస్తున్న కారణంగా బాలయ్యకు జలుపు చేసినట్లుగా ఉంది. గొంతు సరిగా లేక పోయినా కూడా ఆయన చాలా సమయం అభిమానులతో మాట్లాడాడు. బాలయ్య లైవ్‌లోకి రాగానే భారీగా ఫ్యాన్స్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ను చూశారు. బాలయ్యపై తమకు ఉన్న అభిమానంను ఛాటింగ్‌ ద్వారా ప్రదర్శించారు. బాలయ్య ఇలా లైవ్‌ చాట్‌లోకి రావడం సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

- Advertisment -
spot_img

Most Popular