బాలయ్య చూపు బుల్లితెరపై పడిందా?

 balakrishna built a new tv chanal andhrapradeshరాష్ట్రం విడిపోయాక వెండితెర,బుల్లితెర రంగాలు తమను పలకరిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూశారు.అయితే వున్నచోటు నుంచి కదలడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. పైగా సినీ రంగ ప్రముఖులు కేసీఆర్ ని పొగిడి చంద్రబాబు కి పుండు మీద కారం చల్లేలా వ్యవహరిస్తున్నారు.అయితే ఒక్క బాలయ్య మాత్రం అప్పుడప్పుడు తన సినిమాలకి సంబంధించిన కార్యక్రమాలు ఆంధ్రాలో నిర్వహిస్తున్నారు.

టీవీ రంగం కూడా ఆంధ్రపై శీతకన్నేసింది.ఒక్క ప్రముఖ ఛానల్ కూడా తమ శాఖల్ని అక్కడ నెలకొల్పలేదు.వ్యాపారపరంగా ఇబ్బందులుంటాయని వాళ్ళు చెప్తున్న కారణం.అయితే ఈ పరిస్థితుల్ని అనువుగా మల్చుకుని విజయవాడ కేంద్రంగా ఓ టీవీ ఛానల్ పెట్టడానికి బాలకృష్ణ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.ఇందుకు సంబంధించి ఆయా రంగ నిపుణులతో చర్చలు సాగించినట్టు సమాచారం. ఇది నిజమైతే మరి కొన్ని చానళ్ళు ఆంధ్రా వైపు చూడొచ్చు.ప్రజల మాటేమోగాని వరసగా చానళ్ళుమూతపడుతున్న దశలో బాలయ్య ప్రయత్నాల గురించి వస్తున్న వార్తలు విలేకరులకు మాత్రం సంతోషం కలిగిస్తున్నాయి.

SHARE