బాలయ్య 101వ చిత్రం టైటిల్‌పై స్పందన

0
275
Balakrishna fans Responds on balayya Paisa vasool title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన బాలయ్య 101వ సినిమాపై ఫ్యాన్స్‌ అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఆ అంచనాలను తాను నిలుపుతాను అంటూ దర్శకుడు పూరి జగన్నాధ్‌ ఒక మాస్‌ మసాలా ప్రాజెక్ట్‌ను బాలయ్యతో మొదలు పెట్టాడు. భవ్య క్రియేషన్స్‌లో పూరి జగన్నాధ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రియ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ను బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా అనౌన్స్‌ చేయడం జరిగింది. ‘పైసా వసూల్‌’ అనే విభిన్న టైటిల్‌ను బాలయ్య చిత్రానికి ఫిక్స్‌ చేయడం జరిగింది.

‘ఉస్తాద్‌’, ‘టపోరి’, ‘తేడాసింగ్‌’, ‘జై బాలయ్య’ ఇలా ఎన్నో టైటిల్స్‌ బాలయ్య 101వ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ చిత్రం టైటిల్‌పై క్లారిటీ వచ్చింది. అయితే గతంలో బాలయ్య నటించిన ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి స్థాయిలో ఈ టైటిల్‌ పవర్‌ ఫుల్‌గా లేదు అంటూ బాలయ్య అభిమానులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. బాలయ్య సినిమా అంటే పవర్‌కు మారు పేరుగా ఉండాలి. టైటిల్‌లోనే ఆ పవర్‌ కనిపించాలి. కాని ఈ టైటిల్‌ మాత్రం ఫోర్స్‌ ఎక్కువ లేదని, మాస్‌ ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్‌ అయ్యేలా టైటిల్‌ లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. టైటిల్‌పై నెగటివ్‌గా స్పందిస్తున్న ఫ్యాన్స్‌ సినిమా తప్పకుండా బాగుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply