Posted [relativedate]
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా విజయవంతం కావాలని ఫ్యాన్స్ 100 రోజుల ముందుగానే 100 దేవాలయాలకు తిరిగేశత పుణ్యక్షేత్ర ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర చరిత్ర ఆధారంగా తెరకెక్కించబడుతున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ కూడా చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ తో ఫ్యాన్స్ సినిమా మీద అంచనాలను పెంచుకోగా సినిమా హిట్ ఆవాలనే ఉద్దేశంతో ఈ యాత్ర కొనసాగిస్తున్నారు.
బాలయ్య చేతుల మీదుగా ఈ యాత్ర మొదలు పెట్టారు. శాతకర్ణి సినిమా దర్శకుడు క్రిష్, బాలయ్య, సినిమా నిర్మాతలు జెండా ఊపి ఈ ఆధ్యాత్మిక యాత్రను మొదలు పెట్టడం జరిగింది. జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే వినోదపు పన్ను రాయితి కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఫ్యాన్స్ ఈ ఆధ్యాత్మిక యాత్రతో సినిమా క్రేజ్ మరింత పెంచేస్తున్నారు. 60 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా బాలయ్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలబడుతుందని చెప్పొచ్చు.