Posted [relativedate]
తెలుగుజాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఇప్పుడీ చక్రవర్తి జీవిత గాథ తెలుగు సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ వందో సినిమా తెరకెక్కుతోన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని దర్శకుడు క్రిష్ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దితున్నాడు.
ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. అయితే, క్రిష్ రాసుకొన్న కథ ప్రకారం శాతకర్ణి మరణంతో సినిమా ముగుస్తుంది. ఈ మేరకు ఓ క్లైమాక్స్ ని ఇప్పటికే తెరకెక్కించాడు క్రిష్. స్యాడ్ ఎండ్ తో సినిమా ముగింపుని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శాతకర్ణి కోసం మరో క్లైమాక్స్ ని కూడా యాడ్ చేశాడు క్రిష్. మరణం, పతనం లాంటి క్లైమాక్స్ కాకుండా కేవలం వాయిస్ ఓవర్ తో శుభం కార్డు వేసే విధంగా ఇంకో ఎండింగ్ ప్లాన్ చేశారట. ఈ రెండింటిలో ఏ క్లైమాక్స్ ని తీసుకోవాలన్నది రిలీజ్ ముందు ఫైనల్ చేయనున్నారు.
ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది. తల్లిగా హేమమాలిని నటించనుంది.ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.