Posted [relativedate]
బాలయ్యకి హైకోర్టు నోటీసులు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ. నిజమే అటు రాజకీయాలతో ఇటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ హైకోర్టు నుండి నోటీసులు అందుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఏపి ప్రభుత్వం కూడా గౌతమీపుత్ర శాతకర్ణి మూవీకి వినోదపు పన్నును మినహాయించింది. ఈ వినోదపు పన్ను మినహాయింపే ఈ నోటీసులు జారీ చేయడానికి కారణం అయ్యింది.
వినోదపు పన్ను మినహాయింపు నిర్మాతలకు కాకుండా ప్రేక్షకులకు మాత్రమే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిన్న ఈ పిల్ ని విచారించిన హైకోర్టు.. బాలయ్యతో పాటు సదరు సినిమా నిర్మాతలకు కూడా నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. మరి బాలయ్య ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి.