శాతకర్ణి ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..

Posted October 8, 2016

 balakrishna gouthami putr shathakarni movie new look
గౌతమీ పుత్ర శాతకర్ణిగా బాలకృష్ణ ఎలా ఉంటాడో? క్రిష్ చారిత్రకాన్ని ఎలా డీల్ చేస్తాడో? అంత పెద్ద హీరోని బాగా చూపించగలడా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం . గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ చూస్తే చాలు ..మీ సందేహాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి.ఈ ఫస్ట్ లుక్ గురించి చెప్పడం కన్నా చూడ్డమే బాగుంది కదా !

ఈ పోస్టర్ లోనే టీజర్ ముహూర్తాన్ని ప్రకటించేశారు. శాతకర్ణి టీజర్ ను విజయదశమి పర్వదినాన ఉదయం 10.15 నిమిషాలకు రిలీజ్ చేస్తామని చిత్రబృందం
ప్రకటించింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది. హేమ మాలిని బాలయ్య తల్లిగా కనిపించనుంది. అన్నట్టు.. ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE