శాతకర్ణి.. ముహూర్తం పెట్టేశాడు !

Posted October 5, 2016

  balakrishna gouthami putra sathakarni movie teaser release dasara

బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

తాజాగా, దసరా కానుకగా రిలీజ్ చేయనున్న శాతకర్ణి.. టీజర్, ట్రైలర్స్ కి ముహూర్తం పెట్టేశాడు బాలయ్య. ప్రతి విషయంలో బాలయ్య పంచాంగాన్ని ఫాలో
అవుతాడన్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ నుంచి సినిమా రిలీజ్ వరకు ప్రతి దానికి బాలయ్య స్వయంగా ముహూర్తం పెట్టడం బాలయ్యకి అలవాటు. తాజాగా, దసరా టీజర్ కి కూడా ముహూర్తం ఫిక్స్ చేశాడు. అక్టోబర్ 11 ఉదయం 8గం॥కి “గౌతమీ పుత్ర శాతకర్ణి” తొలి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది. తల్లిగా అలనాటి నటి హేమామాలిన కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్. వచ్చే యేడాది సంక్రాంతి కానుకాగా శాతకర్ణి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

SHARE