సర్కార్ సెట్లో బాలయ్య…ఎందుకు,ఎలా?

 Posted October 20, 2016

balakrishna in amitabh bachchan sarkar movie sets
ముంబై లో సర్కార్ 3 షూటింగ్ చురుగ్గా సాగుతోంది.బిగ్ బి అమితాబ్ ,డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ యమా సీరియస్ గా పనిలో వున్నారు .స్టూడియోలో ఒక్కసారిగా చిన్న పాటి హడావిడి..సెట్ లోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు.అయన వెంట క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ వున్నారు.అమితాబ్ ,రామ్ నుంచి వారికి సాదర ఆహ్వానం లభించింది.పలకరింపులు పూర్తి అయ్యాక చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి చర్చ వచ్చింది.గౌతమీపుత్ర శాతకర్ణి గురించి అమితాబ్ అడిగి తెలుసుకున్నారు. తర్వాత సెట్ లో బాలయ్య,వంశీ ఉండగానే రామ్ ,అమితాబ్ నెక్స్ట్ షాట్ కి వెళ్లిపోయారు.మానిటర్ లో వారి పని తీరుని గమనిస్తూ ఉండిపోయారు బాలయ్య,కృష్ణ వంశీ .షాట్ గ్యాప్ లో రామ్ తో బాలయ్య సంభాషించారు.ఇంతకీ సర్కార్ 3 సెట్ లోకి కృష్ణ వంశీ సమేతంగా బాలయ్య రావడం వెనుక ఓ పెద్ద రీజన్ ఉంది.

బాలయ్య 101 వ సినిమా రైతు లో ఓ పాత్రకి అమితాబ్ ని అడగడానికి స్వయంగా బాలయ్య ,కృష్ణ వంశీ వెళ్లినట్టు తెలుస్తోంది.గురువు రామ్ అనుమతి తీసుకుని వంశీ ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం.వర్మ కూడా సర్కార్ సెట్ కి సింహా, లెజండ్ వచ్చినట్టు ట్వీట్ చేసారు. అయన అంతటితో ఆగుతారా ఇంకేమైనా అంటారో అని బాలయ్య ఫాన్స్ వర్రీ అవుతున్నారు.మరికొందరు మాత్రం రాము ,బాలయ్య కాంబినేషన్ గురించి ఊహించుకుని సరదా పడుతున్నారు.

The legend is checking how Sarkar is performing
SHARE