బాహుబలి ఇచ్చిన ధైర్యంతో బాలయ్య అడుగు..!

0
456
Balakrishna is going to go with his 'Gauthamiputra Shatakarni' Tamil Aadiens

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Balakrishna is going to go with his 'Gauthamiputra Shatakarni' Tamil Aadiens
బాహుబలి సినిమా ఎన్నో సినిమాలకు ఆదర్శంగా నిలుస్తుంది. తెలుగు సినిమాలకు తమిళ ఇండస్ట్రీలో ఆధరణ ఉండదని భావిస్తున్న తరుణంలో ‘బాహుబలి’ చిత్రం వంద కోట్ల కలెక్షన్స్‌ను సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. బాహుబలి ఇచ్చిన ఇన్సిపిరేషన్‌తో ఇప్పుడు బాలకృష్ణ తన 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో తమిళ ఆడియన్స్‌ ముందుకు వెళ్లబోతున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని అప్పుడే తమిళంలో విడుదల చేయాలని భావించారు. అయితే ఆ సమయంలో తమిళ డిస్ట్రిబ్యూటర్లు ఏ ఒక్కరు ముందుకు రాలేదు.

ప్రస్తుతం క్రిష్‌ బాలీవుడ్‌లో మణికర్ణిక సినిమా చేయబోతుండటంతో పాటు, బాహుబలి సినిమా వల్ల తెలుగు సినిమా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ఆ కారణాల వల్ల ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ఒక తమిళ డిస్ట్రిబ్యూటర్‌ భారీగా విడుదల చేసేందుకు ముందుకు వచ్చాడు. దాంతో ప్రస్తుతం తమిళ డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే డబ్బింగ్‌ను పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని చెబుతున్నారు. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను అందుకున్న శాతకర్ణి సినిమా తమిళ ఆడియన్స్‌కు నచ్చుతుందా, అక్కడ కాసులు కురిపిస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం బాలయ్య పూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

 

Leave a Reply