టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సీక్వెల్ సినిమాల్లో నటించింది అరుదు. అయితే ఆదిత్య-369 మూవీకి కొనసాగింపు సిద్ధమవుతోందని త్వరలోనే ఆయన ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య మరో సీక్వెల్ చేస్తారంటూ వార్తలొస్తున్నాయి.
2003లో సామి మూవీతో విక్రమ్ సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాను తెరకెక్కించిన హరి విక్రమ్‌తోనే సామి-2 తీయబోతున్నట్లు చెప్తున్నాడు. సామి చిత్రాన్ని బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహ’ పేరుతో రీమేక్ చేయగా.. మన దగ్గర కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడా సినిమా సీక్వెల్ సిద్ధం కానుండడంతో.. మళ్లీ బాలయ్య ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేస్తారనే టాక్ మొదలైంది.