వాట్.. బాలయ్య ఇల్లు పడగొట్టేస్తారా..?

Posted March 31, 2017

Balakrishna May Lose His House In Hyderabad?హైదరాబాద్ లో బాలయ్య ఇంటిని ఓ ల్యాండ్ మార్క్ గా చెబుతుంటారు. చెన్నై నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయినప్పటి నుండి బాలయ్య ఈ ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 45లో కేబీఆర్ పార్క్ పక్కన ఉన్న ఆ ఇల్లు చాలా సెక్యూరిటీతో ఐరెన్ ఫెన్సింగ్ లతో నిర్మితమై ఉంది.  అయితే రోడ్ ఎక్స్ టెన్షన్ లో భాగంగా ఆ ఇంటిని అధికారులు కూల్చివేయనున్నారని సమాచారం.

జూబ్లీ చెక్ పోస్ట్ నుండి  రోడ్ నంబ‌ర్ 45 వరకు రోడ్  వైడెనింగ్ కార్యక్రమాలు చేపట్టేందుకు జీహెంచ్ఎంసీ అధికారులు నడుం బిగించారు. ఇందులో భాగంగా బాలయ్య ఇంటిని పడగొట్టేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది. అలానే బాలయ్య ఇంటి పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ ప్రెటోల్ బంక్ తో పాటు పలు రెస్టారెంట్ లను కూడా కూల్చివేయనున్నారట అధికారులు.   గతంలో కూడా ఒకసారి బాలయ్య ఇంటిని కూల్చివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు రూమర్లుగానే మిగిలిపోయాయి.   మరి తాజాగా వచ్చిన ఈ వార్తల్లో  నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యక తప్పదు.

SHARE