బాలయ్య సరసన హీరోయిన్ ఫిక్స్..

Posted March 29, 2017

balakrishna puri jagannadh movie heroine muskanనందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కి చోటు ఉండగా ముగ్గుర్ని కొత్త వారినే నటించపజేయాలనుకున్నాడు పూరీ. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చేశాడు. అయితే పూరీ ప్రకటన ఇచ్చిన తర్వాత కొత్త హీరోయిన్స్ విషయంలో  నిర్మాత నో చెప్పారు. దీంతో ఎంతో మంది కొత్త అమ్మాయిలు ఆడిషన్స్ కి  వచ్చినా  కేవలం ఒక్క కొత్త హీరోయిన్ ని సెలెక్ట్ చేశాడు పూరీ. మిగిలిన హీరోయిన్స్ గా సీనియర్స్ ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడు.

ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కన్పించబోయే బాలయ్య సరసన నటించే ఛాన్స్ ముస్కాన్ కొట్టేసింది. కొత్త హీరోయిన్ అయినా ఈమెదే కీ రోల్ అని పూరీ చెబుతున్నాడు. ఇప్పటివరకు బాలయ్య కన్పించిన గెటప్స్ కి ఈ సినిమాలో గెటప్ పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నాడు. విదేశాల్లో కూడా చిత్రీకరణ ఉంటుందట. ఇక ఈ సినిమాలో సన్నీలియోన్ ఓ ఐటెం సాంగ్ చేయనుంది. మరి ఇటీవల శాతకర్ణితో 50 కోట్ల క్లబ్ లో చేరిన బాలయ్య ఈ  సినిమాతో 100కోట్ల క్లబ్ లో చేరతాడేమో చూడాలి.

SHARE