బాలయ్యతో పూరి జగన్నాద్ ?

 Posted October 28, 2016

balakrishna puri jagannadh movieటాలీవుడ్ లో ఆసక్తికరమైన కాంబినేషన్స్ కుదరడం చాలా అరుదుగా కనిపిస్తుంటాయ్. ఆ మధ్య పవన్-వెంకీ ‘గోపాల గోపాల’ కోసం కలసి పనిచేశారు. పేరున్న దర్శకుడు-స్టార్ హీరో కలయిక కూడా అంతే. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలయికపై ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా, టాలీవుడ్ లో మరోఆసక్తికరమైన కలయికలో గురించి వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కలయికలో ఓ చిత్రం రాబోతుందనే ప్రచారం ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది.

ఈ మధ్య పూరి కళ తప్పింది. ఆయన్ని వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయి. ‘ఇజం’ తర్వాత పూరి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇజం తర్వాత పూరితో కలసి సినిమా చేద్దామనుకొన్న ఎన్టీఆర్ కూడా పునరాలోచనలో పడ్డాడట. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణకి ఓ కథ వినిపించి ఓకే చేసుకునేందుకు పూరి ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారమ్. ఒకవేళ పూరి కథని బాలయ్య ఓకే చేసినా.. ఈ కలయికలో చిత్రం ఇప్పట్లో సెట్స్ పైకి పరిస్థితి కనబడం లేదు.

SHARE