రైతు కోసం శాతకర్ణి ప్లాన్?

Posted [relativedate]

balakrishna satakarni movie special to amitabh bachchan for rythu movie
బాలయ్య ,కృష్ణవంశీ కాంబినేషన్ లో తలపెట్టిన రైతు సినిమా అటకెక్కినట్టే అని వస్తున్న వార్తలు నిజం కాదట.ఈ విషయాన్ని నటసింహం బాలయ్య స్వయంగా నిర్ధారించారు.రైతు స్టోరీ ఫైనలైజ్ అయినా ఒకటిరెండు విషయాల్లో సందిగ్ధత కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్నట్టు బాలయ్య ఒప్పుకున్నారు.అందులో రైతు స్టోరీ,కాన్సెప్ట్ ఓకే అయినా అందులో కమర్షియల్ అంశాలు జోడించడం మీద ఇంకా కసరత్తు పూర్తి కాలేదట.ఇక సర్కార్ త్రీ తర్వాత డేట్స్ ఇస్తానని అమితాబ్ హామీ ఇచ్చారట.రైతులో అయన పాత్ర ఉండేది 6 ,7 నిమిషాలు మాత్రమే.అయినా ఆ పాత్రకున్న ప్రాధాన్యత వల్ల అమితాబ్ గురించి బాలయ్య అంత పట్టుదలగా వున్నారు.

రైతు సినిమా కోసం అమితాబ్ ని ఒప్పించేందుకు బాలయ్య మరో ప్రయత్నం చేయబోతున్నారు. అయన కోసం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయబోతున్నారు.ఇందుకోసం అమితాబ్ టైం తీసుకోబోతున్నారు.శాతకర్ణి షో టైం లో మరోసారి రైతు ప్రస్తావన తెచ్చి అమితాబ్ ని ఒప్పించడానికి బాలయ్య,కృష్ణ వంశీ ప్లాన్ చేస్తున్నారు.ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయితే రైతు పట్టాలు ఎక్కడం ఖాయమే.

Leave a Reply