Posted [relativedate]
నందమూరి బాలకృష్ణ… టాలీవుడ్ సీనియర్ హీరో. అంతకు మించి హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఓ రాజకీయ నాయకుడు. అటువంటి బాలయ్య మాట్లాడిన ఓ మాట ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయ్యింది… ఫిలింనగర్ లో ప్రకంపనాలు సృష్టిస్తోంది.
ఏపి రాజధాని అమరావతిలో కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. అమరావతిని సర్వాంగసుందరంగా తీర్చిందిద్దుతున్నామని, త్వరలోనే టాలీవుడ్ ను కూడా ఇక్కడకు షిప్ట్ చేసే ప్రతిపాదన ఉందని ప్రకటించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ఉంటుందని అనండంతో టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. కాగా బాలయ్యకు మైక్ చూస్తే పూనకం వస్తుందని, ఆ వేడిలో ఏదో మాట్లాడతాడని కొందరు సినీ నిపుణులు అంటున్నారు. ఒకవేళ నిజంగానే టాలీవుడ్ ని అమరావతికి షిప్ట్ చేసినా ఆశ్చర్యంలేదని చెబుతున్నారు. గతంలో ఒకసారి ఏపి సీఎం చంద్రబాబు కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. అయితే ఆయన టాలీవుడ్ ని వైజాగ్ కి షిప్ట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు చెప్పారు. మరి చివరికి టాలీవుడ్ వైజాగ్ వెళుతుందో, అమరావతికి షిప్ట్ అవుతుందో లేక కేసీఆర్ ఇచ్చే రాయితీలకు ఇక్కడే ఉంటుందో చూడాలి.