మోక్షజ్ఞ తెరెక్కేదెప్పుడు ?

  balakrishna son mokshagna entry when

టాలీవుడ్ ప్రముఖ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా రంగం ప్రవేశంపై తన మనసులోని మాటను బయట పెట్టారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా బాలకృష్ణ సరికొత్త రీతిలో భక్తులకు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులకు తన కుమారుడి సినిమా ప్రవేశంపై నోరు మెదిపారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై చాలా కాలం నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. పలువురు దర్శకులు అప్పుడే మోక్షజ్ఞ సినిమా కోసమని స్క్రిప్ట్స కూడా రడీ చేసుకుంటున్నారన్నట్లు పలు రకాలుగా ఊహాగానాలు చెలరేగాయి.

అయితే బాలకృష్ణ ఆ విషయంపై స్పందిస్తూ మోక్షజ్ఞ తప్పకుండా సినిమాల్లోకి వస్తాడు, హీరోగా అద్భుతమైన చిత్రాలు చేస్తాడు. అయితే అది ఇప్పుడు కాదు. అతడు ఇప్పుడు చదువులో ఉన్నాడు. అది అయిపోయిన వెంటనే అంటే వచ్చే యేడాది చివరికల్లా సినీ ప్రవేశం ఉంటుంది అన్నాడు. అంటే మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం 2017 డిసెంబర్ నాటికి కావచ్చన్న మాట. కాగా బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ అమరావతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రంలో చేస్తున్నాట్లుగా వివరించారు. కృష్ణ పుష్కర స్నానం కూడా బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి వేషధారణలోనే ఆచరించిన విషయం విదితమే.

SHARE