14 రీల్స్ లో బాలయ్య 103 ?

0
540
balayya 103 movie in 14 reels banner

 Posted [relativedate]

balayya 103 movie in 14 reels banner
కథ..కధలో కొత్తదనం అని సినిమా,సినిమాకి మధ్య భారీ గ్యాప్ తీసుకోవడం పెద్ద హీరోలకి అలవాటు అయిపోయింది. ఈ విషయంలో శతాధిక చిత్రాల కథానాయకుడు నటసింహం బాలయ్య ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.తన దగ్గరకు వచ్చిన వాటిలో మంచి కధలకి ఓకే చెప్పి వెంటనే పట్టాలు ఎక్కించేస్తున్నాడు.100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి చేసిన బాలయ్య పెద్ద ఆలస్యం లేకుండా పూరి దర్శకత్వంలో 101 వ సినిమా ఓకే చేసి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు.ఈ సినిమా ప్రోగ్రెస్ అవుతుండగానే 102 వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.తమిళ్ దర్శకుడు కె.ఎస్ రవి కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు.101 షూటింగ్ పూర్తి కాగానే 102 వ సినిమా పట్టాలు ఎక్కుతుంది.

102 వ సినిమా ఖరారు కాగానే 103 వ చిత్రం కోసం కధలు వినడం మొదలు పెట్టారు బాలయ్య.ఈ సినిమా 14 రీల్స్ పతాకం మీద ఉండొచ్చని తెలుస్తోంది.ఇప్పటికే ఆ బ్యానర్ తరపున ఓ కుర్ర దర్శకుడు బాలయ్యకి స్టోరీ చెప్పాడంట.ఆ యంగ్ డైరెక్టర్ చెప్పిన లైన్ నచ్చిన బాలయ్య దానికి పూర్తి స్థాయి స్క్రిప్ట్ పని పూర్తి చేయమని చెప్పారట.ఆ పనయ్యాక ఫైనల్ స్క్రిప్ట్ నచ్చితే బాలయ్య 103 వ సినిమా కూడా ఓకే అయినట్టే.ఒకవేళ ఫైనల్ వెర్షన్ నచ్చకపోతే బాలయ్యతో ఇంతకు ముందు భారీ హిట్ లు ఇచ్చిన ఓ మాస్ దర్శకుడు రంగంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Leave a Reply