బాలయ్య అదరహో…చరిత్ర సృష్టించినట్టే ..

0
798

 balayya gautamiputra satakarni gwalior house set history repeat

బాలయ్య వందో చిత్రం చరిత్ర సృష్టించింది.విడుదలకి ముందే చరిత్ర ఏంటనుకున్నారా?అది కలెక్షన్ వ్యవహారం కాదండీ..గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక చిత్రం కావడంతో ఈ రోజుల్లో అలాంటి సినిమా ఎలా తీస్తారో అన్న సందేహం చాలా మందికి వుంది .అయితే గ్వాలియర్ కోటలో చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా లో దర్శనమిచ్చాయి.అవి చూడగానే ఎవరి సందేహాలైనా దూదిపింజల్లా ఎగిరిపోవడం ఖాయం.చరిత్రని కళ్ళకి కట్టడంలో దర్శకుడు క్రిష్ 100 శాతం సక్సెస్ అయ్యాడు.

బాలయ్య ఆహార్యం అదరహో అనిపించింది.రాజసం ఉట్టిపడుతోంది.ఇంతకుముందొచ్చిన చారిత్రక సినిమాలకి భిన్నంగా కూడా కనిపిస్తోంది.బయటకొచ్చిన చిత్రాల్లో శాతకర్ణి తల్లి గౌతమి పాత్ర పోషిస్తున్న హేమ మాలిని ,ఆమె కోడలి పాత్రలో శ్రీయ వేషధారణ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.క్రిష్ దర్శకత్వ ప్రతిభకి పట్టం కడుతున్న ఈ దృశ్యాలు గౌతమీపుత్ర శాతకర్ణిపై అంచనాలు ఇంకా పెంచుతున్నాయి.

 balayya gautamiputra satakarni gwalior house set history repeat

Leave a Reply