మా నాన్న సినిమాలో నేనే నటిస్తా: బాలయ్య

Posted February 6, 2017

balayya next movie on ntr biopicబాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బయోపిక్  ల హవా నడుస్తోంది. ఇటీవల డబ్బింగ్ చిత్రాలుగా విడుదలైన ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ, దంగల్ సినిమాలు సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి. కాగా ఎప్పటి నుండో మహానటి సావిత్రి బయోపిక్ ని రూపొందించనున్నట్లు నిర్మాత అశ్వనీదత్‌కు అల్లుడైన అశ్విన్‌ ప్రకటించారు. అయితే పలు కారణాల వల్ల ఆ బయోపిక్ ఇంకా  కార్యరూపం దాల్చలేదు. నిజానికి ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. 90ల్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు  దర్శకత్వంలో, కింగ్ నాగార్జున నటించిన  అన్నమయ్య కూడా బయోపిక్కే. వీటన్నింటి   ఇన్సిపిరేషన్ తో తాజాగా  పలు రకాల బయోపిక్ లు మొదలయ్యాయి మరికొన్ని మొదలుకానున్నాయి.

నాగార్జున.. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన హథిరాం బాబా బయోపిక్ ఓం నమో వెంకటేశాయ సినిమా ఆల్రెడీ రిలీజ్ కి సిద్దంగా ఉండగా సుధీర్ బాబు హీరోగా  బాడ్మింటన్ ఛాంపియన్ పుల్లెల గోపీచంద్  బయోపిక్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా తాజాగా తెలుగు సినీ పరిశ్రమ మూలస్తంభమైన నందమూరి తారకరామారావు బయోపిక్ రూపొందేందుకు రెడీగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ చేయనున్నట్లు స్వయంగా బాలయ్యే ప్రకటించాడు.

తన తండ్రి, తెలుగు సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జీవితకథపై తాను సినిమాను తీస్తానని, అందులో  ఎన్టీఆర్‌ పాత్రలో తానే నటిస్తానని తెలిపాడు బాలయ్య.  ఈ సినిమాలో అన్ని రకాల కోణాలు ఉంటాయని, తన బంధువులు, ఎన్టీఆర్ సన్నిహితులను కలసి ఆయన చిన్నప్పటి విశేషాలను తెలుసుకుని కథను సిద్ధం చేస్తామని వివరించాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన దర్శకుడు, నిర్మాతల వివరాలను త్వరలో ప్రకటిస్తానన్నాడు.  ఇటీవలే చారిత్రక ఆధారంగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో శాతకర్ణి పాత్రను పోషించిన బాలయ్య ఎన్టీఆర్ గా ఎలా అలరిస్తాడో చూడాలి.

SHARE