బాలయ్య నెక్ట్స్ సినిమా టైటిల్ తెలుసా?

0
348
balayya next movie title

Posted [relativedate]

balayya next movie titleసంక్రాంతికి విడుదలైన బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు బాలయ్య. దీంతో  బాలయ్య చేసే నెక్ట్స్ సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తి పెరిగింది. బాల‌య్య చేసే 101వ సినిమా క‌థ ఏమై ఉంటుంది ? ద‌ర్శ‌కుడు ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌లు చర్చనీయంశంగా మారాయి.

తాజా సమాచారం  ప్రకారం క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో బాలయ్య 101వ ఉండనుందని తెలుస్తోంది. చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో  హిట్ సాధించిన వినయ్ అయితే తన 101వ సినిమాని సరిగ్గా హ్యాండిల్ చేయగలడని భావించాడట బాలయ్య. వినయ్ వినిపించిన పవర్ ఫుల్ కమర్షియల్ కథ కూడా బాగా నచ్చడంతో ఈ నందమూరి హీరో వెంటనే ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ స్క్రిఫ్ట్ కోసం కొంద‌రు సీనియ‌ర్ రైటర్లు కూడా వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. బాల‌య్యకు బాగా క‌లిసొచ్చిన రెడ్డి పేరుతోనే ఈ సినిమా టైటిల్ కూడా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. గ‌తంలో చెన్న‌కేశ‌వ‌రెడ్డి, ల‌క్ష్మీన‌ర‌సింహా సినిమాలు తీసిన బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను నిర్మించనున్నారట. అయితే రీసెంట్ గా ప్రకటించిన ఎన్టీఆర్ బయోపిక్ చేయడానికి మరికొంత సమయం పడుతుండడంతో ఈ లోగా ఈ సినిమాను కంప్లీట్ చేసే యోచనలో ఉన్నాడట బాలయ్య.

Leave a Reply