గ్వాలియర్ కోటలో బాలయ్య సినిమా..!

0
334
balayya sathakarni shooting madhya pradesh

balayya sathakarni shooting madhya pradesh

నందమూరి నట సింహం బాలకృష్ణ వందవ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈరోజు నుండి మరో షెడ్యూల్ కు శ్రీకారం చుట్టింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కోటలో ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఇక సినిమాలో నటిస్తున్న ఇతర నటీమణులు హేమమాలిని, శ్రీయలు ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతున్నారు.

ఇక గ్వాలియర్ కోటలో షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టిన హేమమాలిని సినిమాలో నటిస్తున్నందుకు ఎంతో ఎగ్సైటింగ్ గా ఉందని.. చరిత్రతో వస్తున్న ఈ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది. ఈ కోటలో రాజ దర్బార్ కు సంబందించిన కొన్ని సీన్స్ షూట్ చేయబడుతుంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక హైదరాబాద్ చేరుకుని ఇక్కడ మరో షెడ్యూల్ తో సినిమా పూర్తి చేసుకుంటుందట. క్రిష్ డైరక్షన్లో వై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇక టీజర్ ను దసరా కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

Leave a Reply