బాలయ్య రాజసం అదిరిందిగా..

0
441
balayya super fame

Posted [relativedate]

balayya super fame
గౌతమీపుత్ర శాతకర్ణి విషయంలో బాలయ్య ఫాన్స్ ఖుషీ అంతాఇంతా కాదు. వాళ్ళు ఒక్కసారైనా నిరాశకి గురి కాకుండా చూడ్డంలో దర్శకుడు క్రిష్ సూపర్ సక్సెస్ అయినట్టే.ఫస్ట్ లుక్,టీజర్,థియేట్రికల్ ట్రైలర్ ఇలా ఒకటేమిటి శాతకర్ణికి సంబంధించి ఏది బయటికొచ్చినా ఫాన్స్ అంచనాల్ని పెంచుతూనే వుంది.ఇప్పుడు ఆడియో ఫంక్షన్ సందర్భంగా రిలీజ్ చేసిన పబ్లిసిటీ పోస్టర్ చూసి బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఓ యోధుడు,వీరాధివీరుడు ఏ విధంగా ఉంటాడని ఫాన్స్ ఊహిస్తారో అంతకు మించి బాలయ్య లుక్ వుంది.గుర్రం మీద వస్తున్న బాలయ్య లో రాజసం చూసి నటసింహం అభిమానులు కేరింతలు కొడుతున్నారు.పొద్దున్న పేపర్ లో ఈ పోస్టర్ కనిపించగానే …సాయంత్రం ఎప్పుడవుతుందా …క్రిష్ ఇంకెంత ఉత్సాహం పంచుతాడా అని బాలయ్య ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఓ చారిత్రక సినిమాకి ఈ రోజుల్లో ఇంత హైప్ తీసుకురావడానికి క్రిష్ పడ్డ తపన ఫలిస్తున్నట్టే వుంది. 100 వ సినిమా మీద బాలయ్య పెట్టుకున్న ఆశలు నెరవేరుతున్నట్టే కనిపిస్తోంది.శాతకర్ణి కధ విన్న కొన్ని గంటల వ్యవధిలోనే బాలయ్య క్రిష్ వైపు మొగ్గినందుకు అప్పట్లో హర్ట్ అయిన బాలయ్య ఫాన్స్ ఇప్పుడు మాత్రం క్రిష్ ని గుండెల్లో పెట్ట్టుకుని చూసుకుంటున్నారు.

                 

Leave a Reply