ఎన్టీఆర్ కి సారీ చెప్పిన పవన్ భక్తుడు

0
499
bandla ganesh say sorry to ntr

Posted [relativedate]

bandla ganesh say sorry to ntr
చాన్నాళ్ల తర్వాత సినిమాకి,మీడియాకి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న నిర్మాత బండ్ల గణేష్ సంచలన విషయాలు చాలా బయట పెట్టేస్తున్నాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బాద్షా,టెంపర్ సినిమాలు తీసిన గణేష్ ఆయనతో విబేధాలు వచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు.బాద్షా సినిమాకి నష్టాలు,టెంపర్ సినిమాకి లాభాలు వచ్చాయని గణేష్ చెప్పాడు.అయితే ఆ సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా కొన్ని చెప్పుడు మాటల వల్లే తనకు,ఎన్టీఆర్ కి మధ్య విబేధాలు వచ్చాయని గణేష్ అంగీకరించాడు.అయితే చెప్పుడు మాటలు వింది ఎన్టీఆర్ కాదట.తానేనని గణేష్ ఒప్పుకున్నాడు.చెప్పుడు మాటలు విని విబేధాలు తెచ్చుకున్నందుకు ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫాన్స్ కి కూడా సారీ చెప్పాడు గణేష్.అంతటితో ఆగకుండా త్వరలో ఎన్టీఆర్ ని స్వయంగా కలిసి సారీ చెప్తానని కూడా గణేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఇక తాను పనిచేసిన దర్శకుల్లో ఒకరు తప్ప అంతా మంచివారేనని గణేష్ చెప్పుకొచ్చాడు.ఆ ఒక్కరికి సినిమా అంటే గౌరవం లేదని …రాత్రి అయితే మందు,డ్రగ్స్ లోకంగా ఉండేవాడని ఆరోపించాడు .అయితే ఆ దర్శకుడు ఎవరో చెప్పడానికి గణేష్ నిరాకరించాడు.కానీ అతనితో పనిచేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్టు వివరించాడు.ఏదేమైనా పవన్ వీర భక్తుడైన గణేష్ గొడవలు వచ్చిన ఇన్నేళ్లకి సారీ చెప్పడం విశేషమే.

Leave a Reply