మోడీ బాధ్యత కాదు రాజీనామా చెయ్…

0
502
bank union chief thomas franco demand to urjit patel should be resign

Posted [relativedate]

bank union chief thomas franco demand to urjit patel should be resignనోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ ఏమాత్రం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్‌ థామస్‌ ఫ్రాంకో అన్నారు .పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థికంగా తీవ్ర అనిశ్చితి నెలకొందని, నోట్ల మార్పిడి కోసం జనం క్యూ లైన్లలో నిలబడి పిట్టల్లా రాలిపోతున్నారని, పని ఒత్తిడి పెరగడంతో గత 12 రోజుల్లో దేశవ్యాప్తంగా 11మంది బ్యాంకు అధికారులు మరణించారని ఈ విపరిణామాలన్నింటికీ ఉర్జిత్  పటేల్‌దే బాధ్యత అని తీవ్రస్థాయిలో ఆరోపించింది. ఇందుకు నైతిక బాధ్యతగా ఆయన సత్వరమే తన పదవికి రాజీనామా చేయాలని సమాఖ్య డిమాండ్‌ చేసింది.

ప్రస్తుత పరిణామాలకు ప్రధాని నరేంద్ర మోదీగానీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీగానీ ఆర్థిక వేత్తలు కానీ బాద్యులు కారన్నారు.పెద్దనోట్ల రద్దు విషయంలో రోడ్‌మ్యాప్‌ కరువైందని, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ తీవ్ర గందరగోళ పరిస్థితికి, ఆందోళనలకు గురై సంభవిస్తున్న సామాన్య ప్రజల మరణాలకూ ఇదే కారణమని ఆరోపించారు.దేశంలో ప్రధానంగా రూ.500, రూ.100 వంద నోట్లే ఎక్కువగా చలామణి అవుతాయని, అందుకే రూ.2వేల నోటుకు ముందుగా ఈ నోట్లనే భారీస్థాయిలో సిద్ధం చేసి ఉండాల్సిందన్నారు. పైగా రూ.2వేల నోట్ల జారీకి అనుగుణంగా ఏటీఎంల సాంకేతికతనూ మార్చలేదని విమర్శించారు.

Leave a Reply