చిన్న నోట్లే కాదు.. సిరా కూడా కరవే..

0
447

Posted [relativedate]

ink_1__3082071f
పెద్ద నోట రద్దుతో ప్రభుత్వానికి ఇంకు కష్టం వచ్చింది.. ఎన్నికల సమయంలో ఓటు వేసినందుకు గుర్తుగా ఇన్‌డెలిబుల్‌ సిరా వాడుతుంటారు. దాని వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగదు.. వెంటనే చెరగదు.. ఈ నేపథ్యంలో నోట్లు మార్పిడి చేసుకున్న వాళ్లు వేరువేరు ఐడీలతో అస్తమానం రాకుండా ఈ ఇంక్‌ని వాడాలని మొదట నిర్ణయించింది.. అంత వరకు బానే ఉంది.. దేశ వ్యాప్తంగా ఒక్కసారి ఎన్నికకైతే కావాల్సినంత ఇంకు ఉంటుంది కాని ఒక్కక్కరికి చాలా సార్లు వేయాల్సి వస్తే అది కూడ కొరత వచ్చింది. ఇప్పటికే ఎన్నికల సంఘం తమ దగ్గరున్నంత సిరా స్టాక్‌ మొత్తం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు చేరవేసింది. ఇప్పుడు అతంతా అయిపోవడంతో.. మార్కెట్‌లో దొరికే దోబీ ఇంక్‌ వాడమంటూ బ్యాంకర్లకు ఆదేశాలిచ్చారు.. ఇప్పటివరకు వాడిన ఇన్‌డెలిబుల్‌ సిరా వల్ల నష్టం లేకున్నా ధోబి ఇంక్‌తో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే మరి.. దాంతో చర్మవ్యాధులు రావడం.. కొంతమేర చర్మం దెబ్బదినడం జరిగే ప్రమాదం ఉంది… మరి జాగ్రత్త బ్యాంకుల దగ్గర వేసే సిరా ఏంటో తెలుసుకుని వెంటనే పోయేలా ప్రయత్నించండి మరి…

Leave a Reply