బ్యాంకులు ఆ రోజు పనిచేస్తాయ్…

Posted September 27, 2016

 banks working day october 10

బ్యాంకుల పనిదినాలపై ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది. వచ్చే నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో 2016 అక్టోబర్ 10వ తేదీని బ్యాంకులు పని చేయనున్నట్టు అసోసియేషన్ తెలిపింది. అక్టోంబర్ 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం, 10న ఆయుధ పూజ, 11న విజయదశమి, 12న మొహర్రం పండుగల కావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

అయితే వరుసగా మూడు రోజుల మినహా ఎక్కువ రోజులు బ్యాంకులు సెలవులు పాటించకూడదనే నిబంధనతో ఆ రోజుల్లో ఒకరోజు పనిదినాన్ని పాటించాలని బ్యాంకులు నిర్ణయించాయి. అక్టోబర్ 10 ఆయుధ పూజ రోజున బ్యాంకులు పనిచేయనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది.

SHARE