ఐసీసీ వర్సెస్ బీసీసీఐ.. వీడని చిక్కుముడి..

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

BCCI outvoted at the ICC meeting may pull out of Champions Trophyఛాంపియన్స్ ట్రోఫీ ముందు జరుగుతున్న రచ్చ ఐసీసీకి తలనొప్పిగా మారింది. శక్తివంతమైన, అత్యంత ధనిక బోర్డు బీసీసీఐతో కోరి తగవు పెట్టుకున్న ఐసీసీ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. నష్టనివారణ చర్యలకు దిగింది. మెజార్టీ సభ్య దేశాలు ఐసీసీ వైపే ఉన్నా.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడకపోతే ఏం జరుగుతుందోనని ఐసీసీకి ఆందోళనగా ఉంది. బంగారు బాతుల్లాంటి భారత్ ఆటగాళ్లు లేకుండా టోర్నీ కళ తప్పుతుందని భావిస్తున్నారు. ఐసీసీపై కోపంతో.. ఇదే టైమ్ లో బీసీసీఐ మరో లీగ్ నిర్వహిస్తే.. అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని గాలికొదిలేసి ఛానెళ్లన్నీ ఈ లీగ్ హక్కుల కోసం పోటీపడతాయనే వార్తలు ఐసీసీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

నమ్మకద్రోహిగా ముద్రపడ్డ శశాంక్ మనోహర్ చేసిన పని ఇప్పుడు ఐసీసీకి కూడా చికాకు కలిగిస్తోంది. ఓ ఇండియన్ అయిన శశాంక్, బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు. అయితే దీని వెనుక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల మంత్రాంగం ఉందేమోననే అనుమానాలు వస్తున్నాయి. గతంలో కూడా ఆ రెండు బోర్డులు ఇలాంటి ఎత్తులు వేసినా పారలేదు. కానీ ఇప్పుడు శశాంక్ మనోహర్ లాంటి నమ్మకద్రోహి అండతో ఆ రెండు బోర్డులు బీసీసీఐని బోనులో నిలబెట్టాలని భావిస్తున్నాయి. కానీ బీసీసీఐతో పెట్టుకుంటే ఐసీసీకే కాదు అన్ని సభ్యదేశాలకూ నష్టమేననేది బిజినెస్ అనలిస్టుల అభిప్రాయం.

క్రికెట్ అంటేనే బిజినెస్. ఈ బిజినెస్ కు భారత్ కు మించిన డెస్టినేషన్ లేదు. గతంలో ఐసీసీ ఆధ్వర్యంలో ఫ్లాపైన టోర్నీలు కూడా భారత్ లో నిర్వహిస్తే సూపర్ సక్సెస్ అయ్యాయి. ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనుకుంటే ముందు భారత్ వైపే మొగ్గు చూపుతుంది ఐసీసీ. కారణం ఇక్కడ మినిమమ్ ఫ్యాన్ బేస్ ఉండటమే. ప్రపంచవ్యాప్తంగా టెస్టులకు కళ తప్పినా.. భారత్ లో మాత్రం ఆ ఛాయల్లేవు. అందుకే బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటే.. అసలుకే ఎసరు వస్తుందని మనోహర్ కూడా లోలోపల భయపడుతున్నాడు. నిజంగానే బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీని బాయ్ కాట్ చేస్తే.. మనోహర్ పై మిగతా సభ్యదేశాలు కూడా తిరగబడటం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే బీసీసీఐతో లోపాయికారీగా మధ్యవర్తుల ద్వారా బేరాలు మొదలుపెట్టాడట.

Leave a Reply