సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తెలుగు బిడ్డ..

0
744

  bcci selection committi chairman msk prasad

భారత మాజీ క్రికెటర్, తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. బుధవారం ముంబైలో జరిగిన సెలక్షన్ కమిటీ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పని చేస్తున్న సందీప్ పాటిల్‌పై వేటు పడినట్లయింది. బీసీసీఐ కార్యదర్శిగా అజయ్ షిర్కే తిరిగి ఎన్నికయ్యారు. ఎమ్మెస్కే ప్యానల్‌లో దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజేప్, శరణ్ దీప్ సింగ్, గగన్ ఖోడాలు సెలక్టర్లుగా పనిచేయనున్నారు. ఆశిష్ కపూర్ జూనియర్ టీం సెలక్టర్‌గా ఎంపికయ్యారు.

సీనియర్, జూనియర్, మహిళల జట్ల సెలక్టర్ల కోసం భారత క్రికెట్ బోర్డు 90 మందిని ఇంటర్వ్యూ చేసింది. సెలక్టర్లు తీవ్ర అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలు రావడంతో.. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం బీసీసీఐ చరిత్రలోనే తొలిసారిగా ప్రకటన జారీ చేయడం విశేషం. లోధా కమిటీ మార్గదర్శకాలకు భిన్నంగా బీసీసీఐ ప్రకటన వెలువరించింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలను లోధా కమిటీకి పంపనున్నారు. ఐసీసీలో భారత క్రికెట్ బోర్డు ప్రతినిధిగా బీసీసీఐ ఛైర్మన్ అనురాగ్ ఠాకూర్ కొనసాగనున్నారు.

గతంలో సౌత్ జోన్ కోచ్‌గా రోజర్ బిన్నీ స్థానంలో నియమితులైన ఎమ్మెస్కే ఇప్పుడు ఏకంగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవినే సొంతం చేసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ జట్టు తరఫున రంజీల్లో పాల్గొన్న ఆయన ఆరు టెస్టులు, 17 వన్డేల్లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడైన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు.

  bcci selection committi chairman msk prasad

Leave a Reply