ఇండస్ట్రీ టాక్ : రాజ్ త‌రుణ్ తో జాగ్రత్తగా ఉండాలంట.. ఎందుకంటే?

0
385
be-careful-with-rajtarun

 Posted [relativedate]

be-careful-with-rajtarunయంగ్ హీరో రాజ్ తరుణ్ చేసివి తక్కువ సినిమాలే. కానీ.. అప్పుడే సినిమా చూపించేశాడు. హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకొన్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగే అన్ని అర్హతలు ఉన్నాయని స్టాంప్ వేయించుకొన్నాడు. మాస్ మహారాజ రవితేజని రిప్లేస్ చేసే హీరో వచ్చాడోచ్.. అంటూ కేకలు వినబడేలా చేశాడు.

అంతేకాదు.. గాసిప్స్ తోనూ మనోడు టాపే. ఒకరిద్దరు హీరోయిన్స్, ఓ బుల్లి తెర యాంకర్ కూడా ఈ యంగ్ హీరో షికార్లు చేసినట్టు పికార్లు పుట్టుకొచ్చాయి. హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తో కలసి ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. ఆమెతో కలసి బయట చాలా చేశాడనే న్యూస్ హల్ చల్ చేసింది.

ఈ మధ్య కాస్త జోరు తగ్గించిన రాజ్ తరుణ్ మళ్లీ.. గేర్ వేశాడు. వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాలో న‌టిస్తున్నాడు. రాజ్ తరుణ్. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న అనూ ఇమ్మాన్యుయేల్ న‌టిస్తోంది. ఈ చిత్రానికి ముందుగా ‘కిట్టుగాడు’ టైటిల్ అనుకున్నారు. ఇప్పుడీ టైటిల్ మారింది.  ‘కిట్టూ వున్నాడు జాగ్రత్త’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రాజ్ తరుణ్ తో ఎందుకు జాగ్రత్తగా ఉండాలన్నది సినిమాలో చూడాలి మరీ.. !

Leave a Reply