బిర్యాని తింటున్నారా.. జాగ్రత్త మరి…

 Posted November 6, 2016

be carefull with raod side beryani
రోడ్డు పక్కన తక్కువ రేటుకి బిర్యాని బోర్డు కనిపిస్తే చాలు కొందరు టక్కున బ్రేక్‌ వేసి ఎంచక్కా లాగించేస్తారు.. ఒక వైపు మాంసం ధరలు ఆకాశానంటుతున్న ఎందుకు తక్కువకు ఇస్తున్నారని క్షణమైనా ఆలోచించరు.. దీన్ని అదునుగా తీసుకుని తక్కువగా ఏ మాంసం దిరికితే దాంతో బిర్యాని చేసి తక్కువ రేటికి విక్రయిస్తున్నారు.. తాజాగా చెన్నై శివారు ప్రాంతాలైన పల్లావరం, రెడ్‌హిల్స్‌ తదితర ప్రాంతాల్లో ఈ అనుభవమే ఎదురైంది.. అక్కడ పిల్లిమాంసం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో రోడ్డు పక్కన విక్రయిస్తున్న బిర్యానీలలో పిల్లిమాంసం వాడుతున్నట్లు ఫిర్యాదులు అందుతుండడంతో పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ (పీఎఫ్‌ఏ) సంస్థ రంగంలోకి దిగింది. పల్లావరంలోని దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఓ దుకాణం వెనుకవైపు 16 పిల్లుల్ని బోనులో బందించిన విషయాన్ని గుర్తించింది. పీఎఫ్‌ఏ ప్రతినిధులు ఆ పిల్లుల్ని విడిపించారు. కాగా బతికున్న పిల్లుల్నే సలసల కాగే వేడినీటిలో వేసి, అవి చనిపోయిన తరువాత చర్మం ఒలిచి మాంసాన్ని బిర్యానీకి వినియోగిస్తున్నారు. దీనిపట్ల వివిధ ప్రాంతాల్లోని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే త్వరలోనే పిల్లి కూడా అరుదైన జంతువుల జాబితాలో చేరిపోవడం ఖాయమని జంతుప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. మరి జాగ్రత్త బిర్యాని తినేటప్పుడు అది ఏ జంతువు మాంసంతో వండిందో తెలుసుకుని తినండి మరి…

SHARE