మిల మిల మెరిసే చర్మం కోసం …టిప్స్

0
567
beauty tips

Posted [relativedate]

beauty tipsఅందమైన మచ్చలు లేని చర్మం కలిగి ఉండటం. అందమైన ముఖము పొందటానికి అనేక రకముల స్కిన్ క్రీమ్స్ వాడి ఉంటారు. కాని మీకు ఎటువంటి ఫలితం కనిపించలేదా? వాతావరణ కాలుష్యం వలన మీ చర్మం రంగు మారి మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. మీ చర్మానికి పోషకాలు అందకపోవడం మరియు ఒత్తిడి ఎక్కువగా ఫీల్ అవడం వలన కూడా చర్మం కాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.
కొన్ని సూచనలను పాటించడం వలన మీరు అందమైన చర్మాన్ని పొందగలరు. గృహ చిట్కాలను పాటించి అందమైన చర్మాన్ని కాపాడుకోండి

పేస్ ప్యాక్….
సగం టేబుల్ స్పూన్ తేనే, ఒక కప్పు టీ వాటర్ మరియు 2 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండిని తీసుకొని బాగా కలిపి పేస్టు తయారైన తరువాత ముఖానికి మసాజ్ చేస్తూ అప్లై చేయండి.15-20 నిమిషములపాటు అలానే ఉంచి రుద్దుతూ పేస్ ప్యాక్‌ని తొలగించాలి. రుద్దుతూ తొలగించడం చాలా ముఖ్యమైన పని ఎందుకంటే అలా చేయడం వలన చర్మ కణాలు ఉత్తేజంచెంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
పసుపు….
బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ పాలు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ నిమ్మరసం, సగం టేబుల్ స్పూన్ పసుపు మరియు 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకోవాలి. అన్నింటిని బాగా కలిపి పేస్టు చేసి ముఖానికి అప్లై చేయాలి, 15 నిమిషముల తరువాత ప్యాక్ ఆరిపోతే మంచి నీటితో కడిగి టవల్‌తో తుడవాలి.

పాలు మరియు తేనే…
ఒక టేబుల్ స్పూన్ పాలు లేక పాల పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు నిమ్మరసం తీసుకోవాలి. మూడింటిని బాగా కలిపి శుభ్రంగా ఉన్న మీ ముఖానికి వేసుకోవాలి. 15 నిమిషముల తరువాత మంచి నీటితో కడగండి.

పెరుగు మరియు వోట్మీల్….
ఒక టేబుల్ స్పూన్ పెరుగు, టమాటో మరియు ఒక టేబుల్ స్పూన్ వోట్మీల్ కలిపి పేస్టు చేయండి. ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషములు ఆరే వరకు ఉంచండి. పేస్ ప్యాక్‌ని కడుగుతూ రుద్దండి. రుద్దడం వలన చర్మ కణాలు ఉత్తేజం చెంది చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

బంగాళదుంప గుజ్జు..,
బంగాళదుంప చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిలో విటమిన్-సి ఎక్కువగా ఉండటం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బంగాళదుంప సహజంగా చర్మాన్ని తెల్లగా చేస్తుంది. బంగాళదుంప గుజ్జుని ముఖానికి అప్లై చేసి, 30 నిమిషముల తరువాత నీటితో కడగండి. ఇలా రోజూ చేయడం వలన మీ చర్మం కాంతివంతంగా, మృధువుగా తయారు అవుతుంది. మీరు బంగాళదుంప గుజ్జుతో నిమ్మరసాన్ని కూడా కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. నిమ్మలో బ్లీచింగ్ కారకం ఉండటం వలన మీకు తక్కువ సమయంలో ఫలితం కనిపిస్తుంది.

బాదం నూనె…..
తెల్లని చర్మం పొందాలి అంటే బాదం నూనెతో మీ ముఖానికి మద్దన చేయాలి. కొంచెం వేడి చేసిన నూనెను ఉపయోగించాలి. ఇది రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. బాదంని మనం ఇంకో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. రాత్రి అంతా బాదంని నానపెట్టి ఉదయాన్నే పేస్టు చేయండి. పేస్టులో కొంచెం మజ్జిగ కలిపి ముఖానికి వేసుకొని 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగండి.

పుదీనా ఆకులు…
పుదీనా ఆకులకు తాజాతనాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నవి. పుదీనా ఆకులతో మీరు తెల్లని చర్మాన్ని పొందగలరు. అలానే ఇది రక్తాన్ని శుద్ది పరిచే గుణములను కలిగి ఉంది. పుదీనా ఆకుల పేస్టుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగండి. ఇది చర్మ రంధ్రాలలోకి వెళ్లి సన్ టాన్ని తొలగిస్తుంది.

అరటిపండు…
మీ చర్మానికి తెల్లదనం ఇవ్వడంలో అరటిపండు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అరటిపండును ఫేసు ప్యాక్‌గా ఉపయోగించడం వలన మీరు తొందరగా ఫలితాన్ని పొందగలరు. పసుపుగా పండిన అరటిపండు గుజ్జును తీసుకొని దానిలోకి టేబుల్ స్పూన్ తేనే మరియు పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషముల తరువాత నీటితో కడగండి. ఇలా చేయడం వలన మీరు ప్రకాశించే చర్మాన్ని పొందటమే కాకుండా సన్ టాన్ నుంచి విముఖ్తి చెందగలరు.

ఎండిన నారింజ తొక్క…
మీరు నారింజ తొక్కను ఎండలో ఎండపెట్టి పొడి చేసుకోవచ్చు, లేకుంటే మార్కెట్లో మీకు నారింజ తొక్కుల పొడి లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కుల పొడిలో పెరుగు కలిపి పేస్టు చేసి, ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగండి. ఇలా చేయడం వలన మీకు తెల్లని మరియు ప్రకాశవంతమైన చర్మం లభిస్తుంది.

గంధపు చెక్క..
మీరు ఆయిలీ చర్మాన్ని కలిగి ఉన్నారా? మీరు తెల్లని చర్మం కావాలి అని ఆశ పడుతున్నారా? అయితే ఇది మీకు అద్భుతమైన చిట్కా. గంధపు పొడిని నీటితో కలిపి ముఖానికి అప్లై చేసి, ప్యాక్ ఆరిపోయిన తరువాత చల్లని నీటితో కడగండి. మీరు ఫలితాన్ని చాల తొందరగా గమనించవచ్చు.

Leave a Reply