ఇంకా విడుదల కాకుండానే ఆ ఆలోచనా?

0
327
Before dj movie release Allu Arjun plan for another movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Before dj movie release Allu Arjun plan for another movie
మెగా హీరో అల్లు అర్జున్‌, హరీశ్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డీజే’ చిత్రం త్వరలో విడుదలకు సిద్దం కాబోతుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌, తాజాగా విడుదలైన టైటిల్‌ సాంగ్‌ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచేస్తున్నాయి. అయ్యగారిగా అల్లు అర్జున్‌, గ్లామర్‌ క్వీన్‌గా పూజా హెగ్డే చేయబోతున్న సందడి కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సాదారణ ప్రేక్షకులకు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

‘డీజే’ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఆ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఒక స్టోరీ రాయడం జరిగిందట. ఆ స్టోరీని విన్న అల్లు అర్జున్‌ చాలా ఇంప్రెస్‌ అయ్యి వెంటనే సినిమాను చేసేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. హరీశ్‌ శంకర్‌ మొదట తయారు చేసుకున్న కథను రెండు పార్ట్‌లుగా విడదీసి, మొదటి పార్ట్‌ను ఇప్పటికే తెరకెక్కించాడని, మిగిలిన స్టోరీని సీక్వెల్‌గా తీసే ఆలోచన చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. డీజేను నిర్మిస్తున్న దిల్‌రాజు సీక్వెల్‌ను కూడా నిర్మించే అవకాశాలున్నాయి. అయితే సీక్వెల్‌కు కాస్త సమయం పట్టే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇంకా డీజే రాకుండానే దాని సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు అంటే సినిమాపై ఎంత నమ్మకంగా ఉండి ఉంటారు అని మెగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. డీజే ఫలితం తారు మారు అయితే సీక్వెల్‌ ఆలోచన చేయక పోవచ్చు, అయితే సక్సెస్‌ అయితే మాత్రం వెంటనే వచ్చే సంవత్సరంలోనే సీక్వెల్‌ను దించే అవకాశం ఉంటుంది.

Leave a Reply