ముందు పెళ్లి ..ఆ పై సీఎం పీఠం

 before marriage after cm chair
16 ఏళ్ల సుదీర్ఘ దీక్ష విరమించిన మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం చాను షర్మిల తన లక్ష్యం సీఎం పీఠమేనని ప్రకటించారు .దీక్ష విరమణకు ముందు పోలీసులు ఆమెను జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు .విచారణ సందర్భంగా షర్మిల తన తరుపున తానే వాదించుకున్నారు .తానే తప్పు చేయలేదని ,తనపై కేసులు ఎత్తివేయాలని కోరారు.తప్పులు ఒప్పుకుంటే కేసుల ఎత్తివేస్తామని న్యాయమూర్తి చెప్పారు .విచారణ ఆగష్టు 23 కి వాయిదా పడింది .

సాయుధబలగాల ప్రత్యేక చట్టాన్ని ఎత్తివేయాలన్నడిమాండ్ తో షర్మిల 16 ఏళ్లుగా దీక్ష చేస్తున్నారు .ఎవరెన్ని రకాలుగా చెప్పినా ఆమె దీక్ష విరమించలేదు .అయితే ఇటీవల బ్రిటన్ కి చెందిన ఓ సామాజిక శాస్త్రవేత్త ప్రేమలో పడ్డ ఆమె అయన మాటను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది .భవిష్యత్ ప్రణాళిక గురించి ఆమె వివరించారు .పెళ్లి చేసుకుంటానని చెప్పారు షర్మిల .రాజకీయాల్లోకి అడుగుపెట్టి సాయుధ బలగాల ప్రత్యేక చట్టాన్ని ఎత్తేసేలా కృషి చేస్తానన్న ఆమె ..సీఎం పీఠం ఎక్కుతానని ధీమా వ్యక్తం చేశారు .అయితే సొంత పార్టీ పెడతారో లేక ఏదో ఒక జాతీయ పార్టీలో చేరతారో ఆమె చెప్పలేదు .

SHARE