అబ్బే..గాలి కూతురు పెళ్లి సింపుల్ ..

 Posted October 21, 2016

bellary mp sriramulu said about gali janardhan reddy daughter brahmani wedding
గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో మీడియా ఊపిరాడకుండా చెప్తోంది.నిశ్చితార్ధం రోజు గాలి కుమార్తె బ్రాహ్మణి వేసుకున్న బంగారం చూసి చాలా మందికి షాక్ తగిలింది.బంగారపు తాపడం మధ్య గాలి కుమార్తె మొహం చిన్నదైపోయింది.ఇక శుభలేఖ వీడియో చూసాక సెలబ్రిటీ ల కళ్ళు కూడా తిరిగాయి.ఇక పెళ్లి ఎలా జరుగుతుందో టీవీ చానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలు వేసి చూపిస్తున్నాయి.కానీ గాలి కుమార్తె పెళ్లి సింపుల్ గానే జరుగుతోంది అంటున్నారు..ఆ మాటలన్నది ఎవరో తెలుసా?

గాలి కుటుంబానికి అతి సన్నిహితుడైన బళ్లారి ఎంపీ శ్రీరాములు బ్రాహ్మణి పెళ్లి గురించి మాట్లాడారు.అబ్బే మీడియా లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు …పెళ్లి సింపుల్ గా ఓ మధ్యతరగతి కుటుంబం లో చేసినట్టే చేస్తున్నారు …అని శ్రీరాముల వారు సెలవిచ్చారు.పైగా పెళ్ళికి పెద్దగా ఖర్చు చేసే ఉద్దేశం లేదని ..ఏదో శుభలేఖ అధునాతన పరిజ్ఞానంతో రూపొందించాము తప్ప ఖర్చేముందని అయన ఎదురు ప్రశ్నించారు.ఒక్కో పెళ్లి కార్డు కి 6 వేలు ఖర్చు పెట్టేది మధ్యతరగతి పెళ్లి అయితే గాలి లాంటి వాళ్ళు తమ స్థాయికి తగ్గ వివాహం జరిపిస్తే ఇంకెలా ఉంటుందో ?

gali daughter wedding

SHARE