కుప్ప‌కూలిన ఏడంతస్తుల భ‌వ‌నం… చిక్కుకున్న35 మంది కార్మికులు

0
382

Posted [relativedate]

bengaluru-building

బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న‌ ఏడంతస్తుల భ‌వ‌నం ఈరోజు మ‌ధ్యాహ్నం కుప్ప‌కూలిపోయింది. శిథిలాల‌ కింద మొత్తం 35 మంది కార్మికులు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎన్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 15 మందిని ర‌క్షించారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నారు.  ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply