బేతాళుడు మరో ట్విస్ట్..!

Image result for bethaludu

బిచ్చగాడు సినిమాతో తెలుగులో ప్రభంజనం సృష్టించిన విజయ్ ఆంటోని రేపు బేతాళుడుగా రాబోతున్నాడు. అయితే ఈ క్రమంలో సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లేలా కొత్తగా రిలీజ్ కు ముందే ఓ 10 నిమిషాల సీన్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు విజయ్. ఇక రేపు రిలీజ్ అవుతుండగా మరో 5 నిమిషాల సీన్ అఫిషియల్ గా రిలీజ్ చేసి సినిమా మీద తనకున్న నమ్మకం ఏంటో చూపించాడు. తెలుగు తమిళ భాషల్లో గురువారం రిలీజ్ అవుతున్న బేతాళుడు పాజిటివ్ బజ్ ఏర్పరచుకుంది.

బిచ్చగాడుతో టాలీవుడ్లో డబ్బింగ్ సినిమాలతో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన విజయ్ ఆంటోని బేతాళుడుతో కూడా అదే రేంజ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 15 నిమిషాల సినిమా వదలడమే కాకుండా సినిమాలోని సాంగ్స్ ఫుల్ వీడియోస్ ను రిలీజ్ చేశాడు. సినిమాను మొత్తం చూపిస్తే థియేటర్ కు ఏం వస్తారు అంటే.. మొదటి 15 నిమిషాలు చూపించి ఆ తర్వాత ఏమవుతుంది అన్న ఎక్సయిట్మెంట్ ఆడియెన్స్ లో కలిగేలా చేస్తున్నాడు. ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.