‘భేతాళుడు’కి అంటుకున్న కాపీ మరక

Posted December 3, 2016

Image result for bethaludu

బిచ్చగాడు సినిమాతో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించడమే కాకుండా తెలుగులో డబ్బింగ్ సినిమాల చరిత్రలో ఓ సంచలనం సృష్టించిన తమిళ నటుడు విజయ్ ఆంటోని రీసెంట్ గా భేతాళుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమా కథ కథనాలు ప్రేక్షకులను మెచ్చుకునేలా చేసినా సినిమా బిచ్చగాడు రేంజ్ కాదని అంటున్నారు. ఇక సినిమా కథ ఓ డ్రగ్ కు బానిసై ఆ క్రమంలో తన పూర్వ జన్మ తెలుసుకుని ఆ జన్మలోని కసిని ఇప్పుడు తీర్చుకోవాలనుకోవడం.

అయితే 2014లో లూసీ అనే హాలీవుడ్ సినిమా కథ కూడా ఇదే విధంగా ఉంటుందట. ఇందులో కూడా హీరోయిన్ స్కార్లెట్ జోహాన్సెన్ జన్మ జన్మల రహస్యాలను తెలుసుకుని అడ్వాన్సెడ్ టెక్నాలజీ కంప్యూటర్ గా పనిచేస్తుంది. ఇక చివరగా ఆత్మగా గాలిలో కలిసిపోతుంది. అయితే ఈ కథతోనే బేథాళుడు కథను రూపిందించి ఉంటారని తెలుస్తుంది. ప్రదీప్ కృష్ణమూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలో సైతాన్ గా రిలీజ్ అయ్యింది.

మరి కాపీ అంటూ వస్తున్న వాదనలు ఎలా ఉన్నా సినిమా అటు తమిళ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథనంలో ఇంకా గ్రిప్ సాధించి నట్టయితే భేతాళుడు సినిమా కూడా విజయ్ కు మరో సూపర్ హిట్ తెచ్చిపెట్టే ఛాన్స్ ఉండేది.

SHARE