భల్లాలదేవుడికి భద్ర సరోగసి కొడుకు!!

0
509
bhallaladheva son bhadhra is adopt boy in bahubali movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

bhallaladheva son bhadhra is adopt boy in bahubali movie
‘బాహుబలి 2’ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. విడుదలై రెండు వారాలు అయినా కూడా ఇప్పటి వరకు ఏమాత్రం క్రేజ్‌ తగ్గకుండా భారీ వసూళ్లను రాబడుతూ వస్తుంది. ఇప్పటికే వెయ్యి కోట్లు క్రాస్‌ చేసిన ‘బాహుబలి 2’ త్వరలోనే 1500 కోట్ల మార్క్‌ను కూడా దాటేయనుందని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. సినిమా వీర లెవల్‌లో దుమ్ము దుమ్ము కలెక్షన్స్‌ వసూళ్లు సాధిస్తుంటే మరి కొందరు మాత్రం ఈ సినిమాలోని కొన్ని ప్రశ్నలను, వాటికి సమాధానాలు లేక పోవడంను ఎత్తి చూపుతున్నారు. ఒక సినిమా అంటే పూర్తి క్లారిటీగా, ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఉండాలి. కాని ‘బాహుబలి’లో మాదిరిగానే ‘బాహుబలి 2’లో కూడా పలు సమాధానం లేని ప్రశ్నలున్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

‘బాహుబలి 2’లో అందరు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న విలన్‌ భల్లాలదేవుడి భార్య ఎవరు, కొడుకు భద్ర ఎలా పుట్టాడు. ఈ ప్రశ్నకు రాజమౌళి కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదు. మొదటి నుండి కథలో భల్లాలదేవుడి భార్య గురించి అనుకోలేదు. అందుకే చూపించలేదని, ఆ విషయం అంత ప్రాముఖ్యం అని తాము భావించలేదని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజాగా రానాకు ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. భల్లాలుడికి భార్య లేనప్పుడు కొడుకు భద్ర ఎలా కలిగాడు అంటూ ప్రశ్నించారు. అయితే అందుకు సమాధానంగా రానా మాట్లాడుతూ.. భల్లాలుడికి భద్ర సరోగసి పద్దతిలో పుట్టాడు అని, వారసుడి కోసం భల్లాలుడు భద్రను సరోగసి పద్దతి ద్వారా కన్నాడు అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు. ఈ సమాధానంతో మీడియా ప్రతినిధులు అంతా నవ్వుకున్నారు.

Leave a Reply