వంశీ ప్రేమను అంగీకరించిన భానుప్రియ !

Posted October 6, 2016

  bhanupriya accept vamshi loveవంశీ ప్రేమను భానుప్రియ అంగీరించింది. అదేంటీ.. ? ఇన్నాళ్లకి భానుప్రియ-వంశీ పెళ్లిచేసుకోబోతున్నారా ?? అని కంగారు పడకండీ.. ! ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. దర్శకుడు వంశీ ‘సితార’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది భానుప్రియ. ఆ తర్వాత తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సితార , అన్వేషణ, స్వర్ణకమలం లాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో భానుప్రియ ఖాతాలో చేరాయి.

భానుప్రియకి ఎక్కువ హిట్స్ అందించింది మాత్రం వంశీనే.  సితార , అన్వేషణ, ఆలాపన సినిమాలకి వంశీతో కలసి పనిచేశారు భానుప్రియ. అయితే, ఈ దశలో
వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పట్లో భానుప్రియని పెళ్లాడాలని వంశీ భావించాడట. అప్పటికే వంశీకి పెళ్లైంది. అయినా.. భానుప్రియని గాఢంగా  ప్రేమించారట. ఈ విషయాన్ని స్వయంగా భానుప్రియ తాజాగా ఓ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

”వంశీ గారితో కలసి మూడు సినిమాలకు పని చేశాను. అప్పట్లో ఆయన నన్నుఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుంటానని కూడా అడిగారు. అప్పటికి నేను బాగా చిన్న పిల్లని. ఈ విషయంలో నిర్ణయం మా అమ్మకి వదిలేశాను. ఇందుకు మా అమ్మగారు ఒప్పుకోలేదు. జరిగింది ఇదే” అంటూ వంశీ ప్రేమని అంగీకరించారు
భానుప్రియ.

SHARE