“భరత్ అను నేను” శ్రీమంతుడు సీక్వెల్

Posted March 18, 2017

bharath ane nenu movie sequel of mahesh srimanthudu movie2015లో మహేష్ బాబు.. కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా అప్పట్లో టాలీవుడ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ రానుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం మహేష్.. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ మళ్లీ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.

 ఈ సినిమా శ్రీమంతుడు సినిమాకి సీక్వెల్ అట. ఇందులో మహేష్ లండన్ రిటర్న్డ్ మిలీనియర్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో కూడా శ్రీమంతుడు-1 హీరోయిన్ శృతిహాసన్ నే సెలెక్ట్ చేయనున్నాడట కొరటాల శివ. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా  మొదలుపెట్టాడు కొరటాల. ప్రస్తుతం మహేష్.. మురుగదాస్ సినిమా షూటింగ్  పూర్తి అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి శ్రీమంతుడు సాధించిన విజయాన్ని ఈ  సీక్వెల్ కూడా సాధిస్తుందేమో చూడాలి.

SHARE