భారత్ బంద్ అట్టర్ ఫ్లాప్

Posted November 28, 2016, 10:00 am

parliament-opposition-759
నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ అదంతా తుస్సుమన్నది. విపక్షాలు భారత్ బంద్ కు పిలుపిస్తే.. ఎవరికీ వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బంద్ కాదు కేవలం నిరసనే కొన్ని పార్టీలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఆక్రోష్ దివస్ గా పాటిస్తోంది. లెఫ్ట్ పార్టీలు బంద్ అన్నాయి. ఇతర పార్టీలు మాత్రం నిరసన అని ప్రకటించాయి.

బంద్ పై విపక్షాలకు క్లారిటీ లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలిపే సువర్ణావకాశాన్ని ఆపార్టీలు మిస్ చేసుకున్నాయి. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా బంద్ ప్రభావం లేదు. బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. ఎవరికీ ఎలాంటి ఆటంకం లేదు. స్కూళ్లు, ఆఫీసులకు ఎలాంటి హాలిడే లేదు. సో భారత్ బంద్ కు స్పందన కరువైందని స్పష్టమైపోయింది.