భారత్ జయ భేరి ..ఇంగ్లాండ్ పై విజయం

153

Posted November 29, 2016, 4:44 pm

Image result for india won the match quotes

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో దూసుకుపోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 78/4తో నాలుగో రోజు, మంగళవారం ఆట కొనసాగించిన ఇంగ్లాండ్‌ను టీమిండియా బౌలర్లు 236 పరుగులకు కుప్పకుల్చారు. జోరూట్‌ (78), హసీబ్‌ హమీద్‌ (59 నాటౌట్‌) అర్ధశతకాలు చేయడంతో భారత్‌కు ఆ జట్టు 103 పరుగుల లక్ష్యం విధించింది. అశ్విన్‌ 3, షమి, జడేజా, జయంత్‌ యాదవ్‌ తలో 2 వికెట్లు తీశారు.

పార్థివ్‌ దూకుడు భారత రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ (67; 54 బంతుల్లో 11×4, 1×6) చెలరేగి ఆడాడు. టెస్టుల్లో దాదాపు 12 ఏళ్ల తర్వాత అర్ధశతకం బాదాడు. ఛతేశ్వర్‌ పుజారా (25; 50 బంతుల్లో 4×1), విరాట్‌కోహ్లీ ( 6 నాటౌట్‌; 11 బంతుల్లో)తో కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. 8 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన విన్నింగ్‌ షాట్‌ కొట్టాడు.

స్కోరు వివరాలు
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 283 (93.5 ఓవర్లు)
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 417 (138.2 ఓవర్లు)
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 236 (90.2 ఓవర్లు)
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 104/2 (20.2 ఓవర్లు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here