సొంతపార్టీపై భ‌ట్టి అసంతృప్తి?

 Posted March 22, 2017

bhatti vikramarka upset about on congress leaders behavior in assembly
కాంగ్రెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌… సొంత పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? అందుకే అసెంబ్లీలో ఆయ‌న మాట వినిపించ‌డం లేదా? అంటే ఔన‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

భ‌ట్టి విక్ర‌మార్క… రాష్ట్ర కాంగ్రెస్ లో నెంబ‌ర్ -2 స్థానంలో ఉన్నారు. అంటే ఉత్త‌మ్ త‌ర్వాత ఆయ‌నే. కానీ ఆ స్థాయిలో ఆయ‌న‌కు గౌర‌వం ల‌భించ‌డం లేద‌నే అసంతృప్తితో ఆయ‌న ఉన్నార‌ని స‌మాచారం. ముఖ్యంగా అసెంబ్లీలో తాను మాట్లాడ‌దామ‌ని అనుకున్న‌ లోపే… కాంగ్రెస్ కే చెందిన ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే ప‌దే ప‌దే లేస్తున్నార‌ట‌. దీంతో త‌న‌కు మాట్లాడే అవకాశం రావ‌డం లేద‌ని ఆయ‌న గుర్రుగా ఉన్నార‌ట‌. ఈ విష‌యంపై ఆయ‌న జానారెడ్డి కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. అయినా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు రాక‌పోవ‌డంపై భ‌ట్టి చాలా ఆగ్ర‌హంగా ఉన్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందుకే ఇక అసెంబ్లీలో తాను అవ‌స‌ర‌మైతే త‌ప్ప మాట్లాడ‌బోనని స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

భ‌ట్టి వాద‌న‌తో కాంగ్రెస్ కు చెందిన కొంత‌మంది ఎమ్మెల్యేలు ఏకీభ‌విస్తున్న‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ ముఖ్య‌నేత‌గా అసెంబ్లీలో ఆయ‌న‌కు త‌గినన్ని అవ‌కాశాలు రావాల్సింద‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి జానారెడ్డి, ఉత్త‌మ్ లాంటి నాయ‌కులు ఇప్ప‌టికైనా ఈ విష‌యాన్ని గ్ర‌హిస్తారా.? భ‌ట్టికి మాట్లాడే అవ‌కాశం ఇస్తారా? అన్నది చూడాలి.

SHARE