అతడే ఆమె ధైర్యం..

0
480
bhavana engaged with his lover naveen

Posted [relativedate]

bhavana engaged with his lover naveen
ఒంటినిండా కళ్ళు..ఆ కళ్ల నిండా కామం మాత్రమే నిండిన మృగాళ్ల మధ్య భలే భలే మగాళ్లు కూడా వుంటారు.ఆ మృగాళ్ల చర్యతో జీవితానికి సరిపడా చేదు అనుభవాన్ని చూసిన నటి భావన …కొద్ది పాటి వ్యవధిలోనే మళ్లీ చిరునవ్వులు చిందిస్తూ కాబోయే జీవిత భాగస్వామితో నిశ్చితార్ధం చేసుకుంది.ఆమె ఆ షాక్ నుంచి ఎప్పుడు తేరుకుంటుందో అనుకునేవాళ్ళకి షాక్ ఇస్తూ ఈ ఫంక్షన్ లో కనిపించింది.ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసిన నిశ్చితార్ధం కాదిది.భావనకు స్నేహితుడు,నిర్మాత అయిన నవీన్ తో ఎప్పటినుంచో ప్రేమలో వుంది.భావన తమకు లొంగలేదన్న కక్షతో కొందరు వారి ప్రేమని,కాబోయే పెళ్లిని ఆపేందుకే డ్రైవర్ ని అడ్డం పెట్టుకుని ఆమె మీద వేధింపులకు పాల్పడ్డారు. ఆ దృశ్యాల్ని ఫోటోలు,వీడియోలు తీశారు.వాటి సాయంతో ఆమెని బెదిరిద్దామని,ఇంకేదో చేద్దామని చూశారు.కానీ భావన సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారి అంచనాల్ని తల్లకిందులు చేసింది.ఇంతకీ భావన కి అంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది.?

భావనతో నవీన్ ఎప్పటినుంచో ప్రేమలో వున్నాడు.భావనకు జరిగింది ఆమెతో పాటు అతనికీ పెద్ద షాక్.కానీ వెంటనే తేరుకున్నాడు.ఆమెకి ధైర్యంగా నిలిచాడు.అసలే చిత్ర పరిశ్రమ,ఆపై లైంగిక వేధింపుల కేసు,అయినా ఎక్కడా నవీన్ వెరవలేదు.ఒక్కసారికూడా ఆమె కి ఆత్మన్యూనత కలిగేలా ప్రవర్తించలేదు.పైగా తానే ధైర్యమైనప్పటికీ అదంతా భావన ఖాతాలో వేసేసి అసలు సిసలు మగాడుగా నిలిచాడు.ఓ అమ్మాయిని ప్రేమించడమంటే,ఆమెతో జీవితాన్ని పంచుకోవడమంటే …కేవలం శారీరక అవసరాలు,ఆర్ధిక ప్రణాళికలు మాత్రమే కాదని నవీన్ నిరూపించాడు.మగాడు అంటే రోషం,మీసం,కండలు తిరిగిన శరీరం,ఆడవాళ్ళ మీద పెత్తనం అనే పర్యాయపదాల్ని మార్చేశాడు .ప్రేమలో అమ్మగా,ధైర్యంతో నాన్నగా,అవసరంలో స్నేహితుడిగా మొత్తానికి భావనకు మానసికంగా ఓ భరోసా గా నిలిచాడు .ఆమెని ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడెయ్యడానికి ఈ నిశ్చితార్దాన్ని త్వరగా జరిగేలా చూశాడు నవీన్ .అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో భావన మొహం ప్రశాంతంగా కనిపించింది.పక్కన నవీన్ అనే అసలుసిసలు మగాడున్నాడన్న నమ్మకం కాబోలు.త్వరలో పెళ్లి,ఆపై నిండు నూరేళ్లు వీరి దాంపత్యం హాయిగా సాగిపోవాలని ఆశిద్దాం. ఈ నవీన్ ని కొందరు మగానుభావులైనా స్ఫూర్తిగా తీసుకుంటారేమో చూద్దాం..

Leave a Reply