Posted [relativedate]
ఆయన ఉంటే ఈయన రాడు..ఈయన కనిపిస్తే ఆయన కానరాడు..ఆయన పేరు ఎత్తితే ఈయన చిటపటలు..ఈయన గురించి మాట్లాడితే ఆయన కారాలుమిరియాలు..ఇదీ ఏ పార్టీలో వున్నా కొన్నేళ్లుగా భూమా,శిల్పా ల మధ్య పరిస్థితి.ఈ నిప్పుల మీద నీళ్లు చల్లడానికి ఎందరు ట్రై చేసినా ఆ నీరే వేడికి ఆవిరైంది తప్ప నిప్పులు చల్లబడలేదు.కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పర్వంలో సీన్ తిరగబడిపోయింది.రాజకీయ ప్రత్యర్ధులు గానే కర్నూల్ జిల్లా ప్రజలకి తెలిసిన భూమా,శిల్పా నామినేషన్ సందర్భంగా పక్కపక్కనే నడిచారు.నవ్వుకుంటూ మాట్లాడుతూ కనిపించారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగా గెలవడానికి పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తానని చెప్పడమే కాకుండా ఆయన కొడుకు వివాహానికి కూడా హాజరు అవుతానని భూమా ప్రకటించారు.ఈ వ్యవహారం అంతా కర్నూల్ రాజకీయం తెలిసిన వాళ్లందరికీ ఓ షాక్.వాళ్లందరికీ ఓ డౌట్ కూడా ఇదెలా సాధ్యమైందని ?
భూమా,శిల్పా మధ్య ఈ సాన్నిహిత్యాన్ని కారణం చంద్రబాబు ప్రయోగించిన ఓ చిట్కా అని తెలుస్తోంది.ఇటు భూమా,అటు శిల్పా తక్షణ రాజకీయ అవసరాలు,ఆశలు కలగలిపి ఓ రాజీ ఫార్ములా రూపొందించారు బాబు.పార్టీ మారిన భూమా ఎప్పుడెప్పుడు క్యాబినెట్ లో చోటు దక్కించుకుందామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.అసలే భూమాకి మంత్రి పదవి అంటున్నారు,ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా నిలుపుకోలేకపోతే రాజకీయ మనుగడ కష్ట సాధ్యమని శిల్పా బ్రదర్స్ మధనపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించే బాబు స్టెప్ తీసుకున్నారు.శిల్పా చక్రపాణిరెడ్డి కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి దాన్ని గెలిపించి తీసుకొస్తే క్యాబినెట్ లో చోటు ఖాయమని కబురు చేశారు.ఇంకేముంది..ఉప్పు నిప్పు కాస్త పాలునీళ్ళులా కలిసిపోయాయి.ఆ ప్రభావమే నామినేషన్ సందర్భంగా పక్కపక్కనే నడుస్తూ శిల్పా,భూమా కనిపించడం.కళ్ళు నులుముకుని చూసినా అది నిజమే …రాజకీయమే ..