భూమన విచారణ సీరియల్ ..

bhumana inquiry serial
తుని విధ్వంసం కేసుకి సంబంధించి వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విచారణ వ్యవహారం టీవీల్లో డైలీ సీరియల్ లా కొనసాగుతూనే వుంది. CID ఆధ్వర్యంలో మరోసారి భూమన ని 7 గంటలపాటు విచారించారు. విచారణ తరువాత బయటకి వచ్చిన భూమన.. ఇదంతా వైసీపీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. తుని ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకే తన్ను ఇబ్బంది పెడుతున్నారని అయన ఆరోపించారు.
మరో వైపు రోజంతా భూమనని విచారించడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారని వైసీపీ శ్రేణులు భావించాయి.భూమనని ఇబ్బంది పెట్టకుండా బయటకు పంపాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుంటూరు CID కార్యాలయం ఎదుట ఆందోళనకి దిగారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడనుంచి తరలించారు. వైసీపీ అధినేత జగన్ సైతం ఎప్పటికప్పుడు పరిణామాలు కనుక్కుంటూ వున్నారు. ఒక వేళ కరుణాకర్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు.
భూమన బయటికి వచ్చాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నా ఈ వ్యవహారానికి ప్రస్తుతం కామా పడిందే తప్ప ఫుల్ స్టాప్ కాదని తెలుస్తోంది.
SHARE