ఈసారి భూమన అరెస్ట్ తప్పదా?

  bhumana karunakar reddy arrest tuni train case
వైసీపీ సీనియర్ నేత,జగన్ సన్నిహితుడు భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ తప్పదా? ఈసారి అయన అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.ఈనెల 6,7 తారీఖుల్లో సుదీర్ఘ సమయం ఆయన్ను విచారించిన cid తాజాగా మళ్లీ ఆయనకి నోటీసులు జారీ చేసింది.మరోసారి విచారణ కోసం ఈ నెల 19 న గుంటూరు cid కార్యాలయానికి రావాలని భూమనకి నోటీసులు పంపింది.తుని విధ్వంసం తరువాత నాటి ఘటనలతో భూమనకి సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.

ముద్రగడ,భూమన మధ్య ఫోన్ సంభాషణలు తరచుగా జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి.ఈ పరిస్థితుల్లో రెండు రోజుల విచారణ పూర్తి చేసి మళ్లీ పిలుస్తున్నారంటే అది రాజకీయ కక్షసాధింపని వైసీపీ ఆరోపిస్తోంది.హోదా అంశాన్ని ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకే ఈ నోటీసులని ఆ పార్టీ భావిస్తోంది.కానీ ఈసారి విచారణ తరువాత భూమనని అదుపులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.

SHARE